![]() |
![]() |
.webp)
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అత్తలు వర్సెస్ కోడళ్ళు మధ్య పోటీ పెట్టింది సుమ. అత్తలుగా శృతి, ప్రీతీ నిగమ్, భార్గవి వచ్చారు. కోడళ్ళుగా శిరీష, లహరి, అంజలి వచ్చారు. సుమ ప్రీతీ నిగమ్ ని ఒక ప్రశ్న అడిగింది "మీరు పూజలు అవి ఎక్కువగా చేస్తుంటారా" అని "నిజం చెప్పాలి అంటే నేను దేవుడికి దణ్ణం పెట్టుకుంటాను.
నాకు ఇది ఇవ్వు అని ఎప్పుడూ అడగను...ఆయనకు తెలుసు కదా ఏమివ్వాలో" అని చెప్పింది "అలా అనుకునే చాలామంది మోసపోతున్నారు..ఆయనకు చాలా పనులున్నాయి... మీకేం కావాలో కరెక్ట్ గా అడగండి..ప్రతీవాళ్ళూ దేవుడా నీకు తెలుసు కదా నాకేం కావాలో అని అంటే నీకేం కావాలో నాకేం తెలుసు అనుకుంటాడాయన..ఒక్క అత్త కూడా కోడలు బాగుండాలి అని అనుకోవడం లేదు, మరి మీరేం అనుకుంటారు " అని కోడళ్లను సుమ అడిగేసరికి "మా అత్త బాగుండాలి మామ్మల్ని బాగా చూసుకోవాలి" అని అనుకుంటాం అని చెప్పారు కోడళ్ళు. "కోడళ్ళు వచ్చాక అత్తల అందం తగ్గిందా" అని అనిపిస్తోంది అంటూ సుమ అట్టలను ఉడికించేసరికి "అత్తల అందం తగ్గితేనే కదా కోడళ్ళు వస్తారు" అంటూ శిరీషా ఆన్సర్ ఇచ్చేసరికి అత్తలు షాకైపోయారు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో "ఏంటో శృతి నాకు కాంపిటీషన్ లా వస్తోంది అనిపిస్తోంది" అంటూ శృతి మీద సుమ సెటైర్స్ వేసింది.."ఏ కుట్టి.
నీకెవరొస్తారు పోటీ" అని సుమ జుట్టు పట్టుకునేసరికి "గట్టిగా పట్టుకోకు జుట్టు ఊడిపోద్ది" అని సరదాగా కౌంటర్ వేసింది సుమ. ఇక సుమ కోడళ్ళు రాగానే "ఇదిగో మీ అందరికీ స్వీట్లు..మీ అత్తలందరికీ షుగర్ వచ్చి ఉంటుంది. అందుకే వాళ్లకు హాట్ ఇచ్చాను" అనేసరికి కోడళ్ళు నవ్వుకున్నారు అత్తలు ఆ కామెంట్స్ కి షాక్ అయ్యారు. ఇలా ఈ షో ఈ వారం ఎంటర్టైన్ చేయబోతోంది.
![]() |
![]() |